మోడీ పాలనలో దేశానికి రక్షణ కరువైంది

మోడీ పాలనలో దేశానికి రక్షణ కరువైంది

అగ్నిపథ్ స్కీంకు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష చేపట్టింది. ఈ సందర్భంగా ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. అగ్నిపథ్ స్కీం వల్ల దేశరక్షణకు ప్రమాదం పొంచివుందన్నారు.  ఈ స్కీం ఒక కాంట్రాక్ట్ సిస్టం అని..ఈ స్కీంలో ఉద్యోగం పొందిన వారికి ఇతర బెనిఫిట్స్ ఏమి ఉండవని చెప్పారు. నరేంద్ర మోడీ పాలనలో  దేశానికి రక్షణ లేకుండా పోతోందన్నారు. నాలుగేళ్ల తర్వాత యువకుల భవిష్యత్ ఏంటని ప్రశ్నించారు. ఈ పథకం వల్ల 5లక్షల కోట్ల పెన్షన్ ని కేంద్రం సేవ్ చేసుకోవాలని చూస్తోందని ఆరోపించారు. ఇక ఈ స్కీం వల్ల రక్షణశాఖలో 15శాతం రిక్రూట్మెంట్ ఆగిపోతోందని.. ప్రపంచంలో ఎక్కడా ఆర్మీలో కాంట్రాక్ట్ విధానం లేదన్నారు. మూడేళ్ల నుండి దేశంలో రిక్రూట్ మెంట్ లేదని..రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు.