అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ రద్దు

అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ రద్దు

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ ను రద్దు చేసి, మెరుగైన రెవెన్యూ  వ్యవస్థను అందుబాటులోకి తెస్తామని కాంగ్రెస్ లీడర్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ధరణి పోర్టల్ వల్ల ధనవంతులకు న్యాయం జరుగుతుంది. పేదవాళ్లకు అన్యాయం జరుగుతుందని ఆయన ఆరోపించారు. ధరణి పోర్టల్ వల్ల భూకబ్జాలు పెరిగిపోయాని అన్నారు.  వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఫిబ్రవరిలో శాసనసభ రద్దు అవుతుందని, మే నెలలో కర్ణాటకతో సహా తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయని ఉత్తమ్ పేర్కొన్నారు. అటు టీఆర్ఎస్ ప్రభుత్వం పైన విమర్శలు చేశారు ఉత్తమ్. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నుంచి ఎమ్మెల్యే దాకా దోచుకో దాచుకో అనే సిద్ధాంతంతో ముందుకుపోతున్నారని అన్నారు. టీఆర్ఎస్ నాయకులు చేసే అరాచకాలు కలెక్టర్ దృష్టికి, ఎస్పీ దృష్టికి తీసుకువెళ్ళిన వారు కూడా ఏం చేయలేకపోతున్నారని ఫైర్ అయ్యారు ఉత్తమ్. 

మరిన్ని వార్తలు ః

 

ఇక్కడ వర్షాలు..అక్కడ ఎండలు

కొత్త కాయిన్లు రీలిజ్ చేసిన ప్రధాని మోడీ