
కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేందుకు రెడీ అవుతున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని నల్గొండ ఎంపీ, మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ కలిశారు. ఏఐసీసీ ఆదేశాలతో రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్లి కలిశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. పార్టీ మారొద్దని బుజ్జగించేందుకు ప్రయత్నించారు. అయినా రాజగోపాల్ రెడ్డి వెనక్కి తగ్గలేదని తెలుస్తోంది. మరోవైపు రాజీనామా చేస్తారన్న ప్రచారం తర్వాత.. మొదటిసారి ఇవాళ మునుగోడు నియోజకవర్గంలో రాజగోపాల్ రెడ్డి పర్యటించనున్నారు.
ఓ మహిళకు ఆర్థిక సాయం చేయడంతో పాటు ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొంటారు. ఇప్పటికే నియోజకవర్గానికి చెందిన ముఖ్యనేతలతో హైదరాబాద్ లోని తన ఇంట్లో వరుస సమావేశాలు నిర్వహించి భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు రాజగోపాల్ రెడ్డి. పార్టీ మార్పు, ఎమ్మెల్యే పదవికి రాజీనామాపై నేతల అభిప్రాయాలు, సలహాలు సూచనలు అడిగి తెలుసుకున్నారు. బీజేపీ మాత్రమే కేసీఆర్ ను ఎదుర్కోగలుగుతుందని రాజగోపాల్ రెడ్డి మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు.