సెక్రటేరియట్‌ను కూలుస్తున్నది మూఢనమ్మకంతోనే

సెక్రటేరియట్‌ను కూలుస్తున్నది మూఢనమ్మకంతోనే

రాష్ట్రంలో ఏం జరుగుతోందో అర్థం కావట్లే
కరోనా కంట్రోల్ లో కేసీఆర్ సర్కారు ఫెయిల్
కరోనా హాస్పిటల్‌లో సౌకర్యాల్లేవ్: ఉత్తమ్
నల్గొండ జిల్లా ఆస్పత్రి, జైలు సందర్శన

నల్గొండ అర్బన్, వెలుగు: కరోనాను కంట్రోల్ చేయడంలో కేసీఆర్ సర్కారు ఫెయిల్ అయిందని, రాష్ట్రంలో ఏం జరుగుతోందో ఎవరికీ అర్థంకాని పరిస్థితి నెలకొందని పీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కరోనా మహమ్మారి తీవ్రస్థాయిలో విజృంభిస్తూ అనేక మంది మరణిస్తుంటే.. సీఎం కేసీఆర్ తన మూఢనమ్మకాలతో వందల కోట్లు ఖర్చు చేసి మంచిగా ఉన్న సెక్రటేరియట్ ను కూలుస్తున్నారని విమర్శించారు. సోమవారం నల్గొండ జిల్లా ఆస్పత్రిని టీపీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్‍ కుమార్‍రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నల్గొండ జిల్లా ఆస్పత్రిలో ఆక్సిజన్‍ లేక కరోనాతో యువకుడు మరణిస్తే.. ఆ యువకుడి తల్లి రోదించిన వీడియో రాష్ట్రమంతటా వైరల్‍ అయ్యింది. నిజామాబాద్‍లో ఆక్సిజన్‍ లేక నలుగురు మృతి చెందారు. హైదరాబాద్‍ ఫీవర్ ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక తాను మరణిస్తున్నట్లు ఓ యువకుడి సెల్ఫీ వీడియో వైరల్‍ అయ్యింది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా సరైన వైద్య సౌకర్యాలు లేక అనేక మంది కరోనాతో చనిపోతున్నారు. రోమ్ నగరం కాలిపోతుంటే చక్రవర్తి ఫిడేల్ వాయించినట్లు సీఎం కేసీఆర్ పరిస్థితి ఉంది’ అని ఎద్దేవా చేశారు.

కరోనా ట్రీట్మెంట్ ను ఆరోగ్యశ్రీలో చేర్చండి
కరోనా చికిత్సను వెంటనే ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చాలని, బీపీఎల్‍ కుటుంబాలకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ట్రీట్మెంట్ అందించాలన్నారు. లాక్‍ డౌన్‍ పెట్టి 4 నెలలు అవుతున్నా.. ఇప్పటికీ సరిపడా బెడ్లు , వెంటిలేటర్లు, ఆక్సిజన్ సిలిండర్లు లేవని, ఈ ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఆస్పత్రులలో అన్ని సౌకర్యాలు ఉండేలా చూడాలని డిమాండ్‍ చేశారు. కరోనా టెస్టులు, మరణాల సంఖ్యపై కేసీఆర్‍ ప్రభుత్వం అబద్దాలు చెబుతోందని, రాష్ట్రంలో ఏదో జరుగుతోందని నేషనల్, ఇంటర్నేషనల్ మీడియాలో వచ్చిందన్నారు . కరోనాతో మరణించినవారి కుటుంబాలకు 10 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని, కరోనా వారియర్స్ మరణిస్తే రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

జిల్లా జైలు సందర్శన
వివిధ నేరాలతో జైళ్లకు వచ్చే వారికి ముందుగానే కరోనా టెస్టులు చేసి జైలుకు తీసుకెళ్లాలని, దీనిపై తమ పార్టీ తరఫున కోర్టును విజ్ఞప్తిచేస్తామని టీపీసీసీ చిఫ్‍, నల్గొండ ఎంపీ ఉత్తమ్‍ కుమార్‍ రెడ్డి అన్నారు. సోమవారం నల్గొండ జిల్లా జైలును ఆయన సందర్శించారు. సౌకర్యాలను పరిశీలించి, ఖైదీలతో మాట్లాడారు.

For More News..

కేసీఆర్.. జగన్‌తో ‌‌‌కుమ్మక్కయ్యావా?

మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ మృతి

నిమ్స్ లో క్లినికల్ ట్రయల్స్.. ఇద్దరికి వ్యాక్సిన్