గడ్కరీని కలిసిన ఎంపీ రవిచంద్ర

గడ్కరీని కలిసిన ఎంపీ రవిచంద్ర

ఖమ్మం, వెలుగు: కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరితో గురువారం బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న పలు జాతీయ రహదారులకు నిధులు కేటాయించాలని, నిర్మాణ దశలో ఉన్న రహదారులను తక్షణమే పూర్తి చేయాలని వినతిపత్రం అందించారు. దీనికి గడ్కరీ సానుకూలంగా స్పందించారని రవిచంద్ర తెలిపారు.