రాజ్యాంగానికి లోబడే ఢిల్లీ బిల్లు

రాజ్యాంగానికి లోబడే ఢిల్లీ బిల్లు
  • అందుకే మద్దతు తెలుపుతున్నం : విజయసాయి రెడ్డి

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ సర్వీసుల బిల్లు రాజ్యాంగ నిబంధనలు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు లోబడే ఉందని, అందుకే ఆ బిల్లుకు మద్దతు తెలుపుతున్నట్లు ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. ఢిల్లీ సర్వీసుల బిల్లుపై సోమవారం రాజ్యసభలో జరిగిన చర్చలో వైఎస్సార్ సీపీ  తరఫున ఆయన పాల్గొన్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన ఢిల్లీకి సంబంధించి ఎలాంటి చట్టాన్నైనా రూపొందించే అధికారాన్ని రాజ్యాంగం పార్లమెంట్‌కు కట్టబెట్టిందని అన్నారు. 

పార్లమెంట్‌లో చేసిన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి ఢిల్లీ ప్రభుత్వ ఎగ్జిక్యూటివ్‌ అధికారాలకు పరిమితులను విధించవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని గుర్తు చేశారు. ఢిల్లీ దేశ రాజధాని అయినందున ఇది దేశంలోని ప్రతి ఒక్కరికీ చెందుతుందని, నీతిలేని పాలన నుంచి ఢిల్లీని రక్షించడానికే వైఎస్సార్ సీపీ ఈ బిల్లుకు మద్దతు తెలుపుతుందన్నారు.