ఫేక్​ రేప్​ కేసు.. మహిళకు పదేండ్ల జైలు

ఫేక్​ రేప్​ కేసు.. మహిళకు పదేండ్ల జైలు

ఇండోర్: కొడుకు వరసయ్యే దగ్గరి బంధువుపై ఆస్తి కోసం ఫేక్​ రేప్​ కేసు పెట్టడంతోపాటు కోర్టుకు తప్పుడు ఎవిడెన్స్​ సమర్పించిన ఓ మహిళకు పదేండ్ల కఠిన జైలు శిక్ష పడింది. భూమిని కాజేసేందుకు రేప్​ నాటకమాడిన ఆ మహిళ కటకటాలపాలైంది. మధ్యప్రదేశ్​లోని దెవాస్​ జిల్లా బరోద గ్రామానికి చెందిన సీమా బాయి సింగ్(45) వితంతువు. తన భర్త సోదరుడి భూమిలో వాటా కోసం ప్రయత్నిస్తున్న ఆమె.. అందుకోసం అతడి కొడుకుపై రేప్ ​కేసు పెట్టింది. వితంతువు అయిన తనపై అతను అత్యాచారానికి పాల్పడినట్లు 2017 జూన్ 3న పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

పోలీసులు కేసు నమోదు చేసి.. నిందితుడిని 2019లో కోర్టులో ప్రొడ్యూస్​ చేశారు. కేసును విచారించిన కోర్టు తప్పుడు ఆరోపణలతో ఫేక్​ఎవిడెన్స్​ సమర్పించినట్లు భావించి ఆమెపై  ఐపీసీ సెక్షన్​182, 211, 195 సెక్షన్ల కింద కేసు నమోదుకు ఆదేశించింది. తర్వాత  కేసు దెవాస్ ​జిల్లా సెషన్స్​ కోర్టుకు మారింది. తాజాగా సెషన్స్​ కోర్టు సీమాబాయిని దోషిగా తేల్చింది. ఆమెకు పదేండ్ల కఠిన జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది.