పార్లమెంటు ఆవరణను ఊడ్చిన ఎంపీలు, మంత్రులు

పార్లమెంటు ఆవరణను ఊడ్చిన ఎంపీలు, మంత్రులు

న్యూ ఢిల్లీ: లోక్ సభ స్పీకర్ తో పాటు ఎంపీలు, మంత్రులు పార్లమెంటు ఆవరణలో చీపురు పట్టి స్వచ్ఛ భారత్​కు నడుం బిగించారు. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా రెండ్రోజుల ‘స్వచ్ఛభారత్ అభియాన్’ ( క్లీన్లీనెస్ డ్రైవ్ ) కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అందరూ కలిసి పార్లమెంటు ఆవరణ శుభ్రం చేశారు. మహాత్మా గాంధీ స్వచ్ఛ సందేశాన్ని వ్యాప్తి చేసేందుకే ఈ కార్యక్రమం చేపట్టామని స్పీకర్ అన్నారు. కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్‌, అనురాగ్ ఠాకూర్, బీజేపీ ఎంపీలు రాజీవ్ ప్రతాప్ రూడీ, హేమమాలిని సైతం చీపురు పట్టి శుభ్రం చేశారు.