మంత్రిపై అలిగి మీటింగ్ బాయ్‌కాట్ చేసిన ఎంపీటీసీలు

మంత్రిపై అలిగి మీటింగ్ బాయ్‌కాట్ చేసిన ఎంపీటీసీలు

జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలో మంత్రిపై ఎంపీటీసీలు అలిగిన సంఘటన జరిగింది. ఇవాళ ఎంపీటీసీల ప్రమాణ స్వీకారం కార్యక్రమం నిర్వహించారు. ఎంపీటీసీలతో మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రమాణం చేయించాల్సి ఉంది. ఐతే.. కార్యక్రమానికి మంత్రి ఆలస్యంగా వచ్చారు. మంత్రి వచ్చేవరకు ఆగాలని అధికారులు ఎంపీటీసీలను కోరారు. ఐతే.. మంత్రి వచ్చేవరకు ఆగడం ఏంటి అంటూ ఐదుగురు ఎంపీటీసీలు అలిగి.. కోపంతో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని బైకాట్ చేశారు. సమావేశాన్ని బైకాట్ చేసిన వారిలో నలుగురు కాంగ్రెస్, ఒక ఇండిపెండెంట్ ఎంపీటీసీ ఉన్నారు.