మల్యాల ఎంపీపీపై నెగ్గిన అవిశ్వాసం

 మల్యాల ఎంపీపీపై నెగ్గిన అవిశ్వాసం

మల్యాల, వెలుగు: మల్యాల ఎంపీపీ మిట్టపల్లి విమల (బీఆర్ఎస్)పై ఎంపీటీసీలు ఇచ్చిన అవిశ్వాసం నెగ్గింది. మంగళవారం స్థానిక మండల పరిషత్ మీటింగ్ హాల్‌‌లో ఆర్డీవో పి. మధుసూదన్ గౌడ్ అవిశ్వాస తీర్మానంపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి, ఓటింగ్ నిర్వహించారు. మండలంలో 14 మంది ఎంపీటీసీలు ఉండగా, నిర్ణీత సమయానికి 9 మంది సభ్యులు హాజరై అవిశ్వాసానికి మద్దతుగా ఓటేశారు. దీంతో ఎంపీపీపై పెట్టిన అవిశ్వాసం నెగ్గినట్లు ఆర్డీవో ప్రకటించారు. కాగా గతేడాది డిసెంబర్‌‌‌‌ 24న కాంగ్రెస్‌‌, బీఆర్ఎస్‌‌, బీజేపీలకు చెందిన 11 మంది ఎంపీటీసీలు అవిశ్వాస నోటీస్​ఇవ్వగా.. ఎంపీపీ హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. స్టే గడువు తీరడంతో మంగళవారం ప్రత్యేక మీటింగ్‌‌ నిర్వహించారు.