
రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. తాజాగా లక్నో షెడ్యూల్‌ను కంప్లీట్ చేశారు. దీంతో ఉత్తరప్రదేశ్‌లో 30 రోజుల లాంగ్ షెడ్యూల్‌ను ముగించారు. విజయవంతంగా కీలక షెడ్యూల్‌ను పూర్తి చేయడంతో రవితేజ, హరీష్ శంకర్‌తో పాటు మూవీ టీమ్ అంతా అయోధ్య ఆలయాన్ని సందర్శించి రామ్ లల్లా ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక ఈ చిత్రంలో రవితేజ పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో కనిపించనున్నాడు. జగపతిబాబు కీలక పాత్రలో నటిస్తుండగా, భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్‌గా నటిస్తోంది. రవితేజ, భాగ్యశ్రీ మధ్య బ్యూటిఫుల్ లవ్ ట్రాక్ ఉంటుందని మేకర్స్ చెప్పారు. ‘నామ్ తో సునా హోగా’ అనే ట్యాగ్‌లైన్‌తో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని పనోరమా స్టూడియోస్, టి సిరీస్ సమర్పణలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల కో ప్రొడ్యూసర్. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు. సూపర్ స్పీడ్‌తో షూటింగ్‌ను పూర్తి చేస్తున్న మేకర్స్.. త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.