గుండె ఒట్టు పెట్టుకున్నదే..

గుండె ఒట్టు పెట్టుకున్నదే..

రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘మిస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బచ్చన్‌‌‌‌‌‌‌‌’. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌‌‌‌‌‌‌‌.  మ్యూజిక్ ప్రమోషన్స్‌‌‌‌‌‌‌‌తో దూసుకెళ్తున్న టీమ్..  ఇప్పటికే రెండు పాటలతో  ఇంప్రెస్ చేశారు. తాజాగా మూడో పాటను రిలీజ్ చేశారు. మిక్కీ జే మేయర్ సాంగ్ కంపోజ్ చేయగా, వనమాలి మీనింగ్‌‌‌‌‌‌‌‌ఫుల్ లిరిక్స్ రాశాడు. కార్తీక్, రమ్య బెహారా కలిసి పాడారు.

‘నిన్ను చూసి గుండె ఒట్టు పెట్టుకున్నదే.. గట్టుదాటి గట్టిగానే కొట్టుకున్నదే.. పట్టుబట్టి పిల్ల చేయి పట్టుకున్నదే.. అగ్గె రాజేశాక ఆగేదెట్టాగే ..’ అంటూ సాగిన రొమాంటిక్ సాంగ్‌‌‌‌‌‌‌‌లో రవితేజ, భాగ్యశ్రీ లుక్స్ ఆకట్టుకున్నాయి. బృందా మాస్టర్ కొరియోగ్రఫీలో వీరిద్దరూ సింపుల్ డ్యాన్స్ మూమెంట్స్‌‌‌‌‌‌‌‌తో మెస్మరైజ్ చేశారు. జగపతిబాబు, సచిన్ ఖేడ్కర్  కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని  పనోరమా స్టూడియోస్,  టి సిరీస్ సమర్పణలో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల కో ప్రొడ్యూసర్. ఆగస్టు 15న సినిమా విడుదల కానుంది.