ప్రతి సంవత్సరం 50 కొత్త పెట్రోల్ పంపులు

 ప్రతి సంవత్సరం 50 కొత్త పెట్రోల్ పంపులు

న్యూఢిల్లీ: మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ (ఎంఆర్​పీఎల్​)  తమిళనాడు, ఆంధ్రప్రదేశ్,  తెలంగాణలలో పెట్రోల్ పంపుల నెట్‌‌‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌ను విస్తరించనుంది. రిఫైనరీ పరిసరాల్లోని మార్కెట్లలోకి వస్తామని సంస్థ ఛైర్మన్ తెలిపారు.  ఎంఆర్​పీఎల్ పెట్రోల్ పంప్ నెట్‌‌‌‌వర్క్ ప్రస్తుతం కర్ణాటక  కేరళలో కేంద్రీకృతమై ఉంది. ప్రభుత్వ యాజమాన్యంలోని ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్​జీసీ)కు  అనుబంధ సంస్థ అయిన దీనికి కర్ణాటకలోని మంగళూరులో చమురు శుద్ధి కర్మాగారం ఉంది. దీనికి దగ్గరగా ఉన్న ప్రాంతాలపై దృష్టి సారించి,  ఫ్యూయల్​ రిటైలింగ్‌‌‌‌లోకి ప్రవేశించింది.​ "కర్ణాటక,  కేరళ రాష్ట్రాల్లో  రిటైల్ విస్తరణపై నిరంతరం దృష్టి సారిస్తున్నాం.  వివిధ దశలలో నిర్మాణంలో 20 రిటైల్ అవుట్‌‌‌‌లెట్‌‌‌‌లు ఉన్నాయి. ఇప్పటివరకు 32 రిటైల్ అవుట్‌‌‌‌లెట్‌‌‌‌లను విజయవంతంగా ప్రారంభించాం" అని చైర్మన్ అల్కా మిట్టల్ చెప్పారు. ప్రస్తుతం ఎంఆర్​పీఎల్​ యాజమాన్యంలోని అవుట్‌‌‌‌లెట్‌‌‌‌ల సంఖ్య 36 వరకు ఉంది.  

రాబోయే 5–-10 సంవత్సరాలలో ప్రతి సంవత్సరం 50 కొత్త పెట్రోల్ పంపులను అందుబాటులోకి తెస్తామని మిట్టల్​ చెప్పారు.  తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్,  తెలంగాణలలోని బంకులను ఏర్పాటు చేస్తామని అన్నారు.  భారతీయ ఆటో ఫ్యూయల్​ రిటైలింగ్ సెక్టార్​లో ప్రభుత్వ రంగ (పీఎస్​యూ) సంస్థల ఆధిపత్యం కొనసాగుతోంది. దేశంలోని 83,685 పెట్రోల్ పంపుల్లో ప్రభుత్వ ఆధీనంలోని ఫ్యూయల్​ రిటైలర్లు ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం  హిందుస్థాన్ పెట్రోలియంలకు 55,035 అవుట్‌‌‌‌లెట్లు ఉన్నాయి. రాస్​నెఫ్ట్​ఇన్వెస్ట్​మెంట్లు నయారా ఎనర్జీకి 6,635 పెట్రోల్ పంపులు ఉన్నాయి. అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్  యూకే బ్రిటిష్​ పెట్రోలియం జాయింట్ వెంచర్ 1,470 రిటైల్ అవుట్‌‌‌‌లెట్‌‌‌‌లను ఏర్పాటు చేసింది.  షెల్ 326 పెట్రోల్ పంపులను నిర్వహిస్తోంది. కర్ణాటకలో 400లకు పైగా, కేరళలో 100 ప్రాంతాల్లో పెట్రోల్‌‌‌‌ పంపుల ఏర్పాటుకు ప్రకటనలు ఇచ్చామని ఎంఆర్‌‌‌‌పీఎల్‌‌‌‌ తెలిపింది.