ఐదేళ్లుగా బాలీవుడ్‌‌లో వరుస సినిమాలు చేస్తున్న మృణాల్ ఠాకూర్

ఐదేళ్లుగా బాలీవుడ్‌‌లో వరుస సినిమాలు చేస్తున్న మృణాల్ ఠాకూర్

ఐదేళ్లుగా బాలీవుడ్‌‌లో వరుస సినిమాలు చేస్తున్న మృణాల్ ఠాకూర్... కిందటేడాది ‘సీతారామం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరైంది. ఈ చిత్రంలోని ఆమె అందానికి, నటనకు ఫిదా అయ్యారు ప్రేక్షకులు. ఇటీవల విడుదలైన హిందీ చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసి గ్లామర్‌‌‌‌ రోల్స్‌‌లోనూ తగ్గేదే లేదని ప్రూవ్ చేసింది. ఓవైపు బాలీవుడ్‌‌లో సినిమాలు చేస్తున్నప్పటికీ.. ‘సీతారామం’ సక్సెస్ తర్వాత  సౌత్ సినిమాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది మృణాల్. అందులో భాగంగా ఇప్పటికే నానికి జంటగా ఓ చిత్రంలో నటిస్తోంది. శౌర్యువ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఇప్పటికే ఓ షెడ్యూల్ షూటింగ్ పూర్తయింది. త్వరలో సెకెండ్ షెడ్యూల్ మొదలవనుంది. మరోవైపు నాగార్జున కొత్త చిత్రంలో మృణాల్ పేరు వినిపిస్తోంది. వెంకటేష్ హీరోగా శైలేష్ కొలను తీస్తున్న ‘సైంధవ్‌‌’లో ఇద్దరు హీరోయిన్స్‌‌ నటించనుండగా అందులో మృణాల్‌‌ను తీసుకోబోతున్నట్టు టాక్. మరోవైపు తమిళ, మలయాళ ఇండస్ట్రీల నుండి అవకాశాలు వస్తున్నాయట. సూర్య కొత్త చిత్రంలో ఆమెను సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ‘సీతారామం’ చిత్రం తరహాలోనే తన క్యారెక్టర్‌‌‌‌కు ఇంపార్టెన్స్‌‌ ఉన్న కథతోనే ఇతర భాషల్లోనూ ఎంట్రీ ఇచ్చే ప్లాన్లో ఉందట మృణాల్.