
సీతారామం మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur). ఇందులో ఓ వైపు సీతగా, మరోవైపు ప్రిన్సెస్ నూర్జహాన్‌గా తన నటనకు ఫిదా అయ్యారు ప్రేక్షకులు. ప్రస్తుతం మృణాల్ తెలుగు, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీయెస్ట్ హీరోయిన్ గా మారింది.
లేటెస్ట్గా హాయ్ నాన్న సినిమాతో మరో బ్యూటిఫుల్ సక్సెస్తో టాలీవుడ్ లో లక్కీ హీరోయిన్గా హవా కొనసాగిస్తోంది. ప్రస్తుతం పరుశురాం డైరెక్షన్లో విజయ్ దేవరకొండతో కలిసి ఫ్యామిలీ స్టార్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉంది. రీసెంట్ గా రిలీజైన టీజర్ ఆడియాన్స్ ను మెస్మరైజ్ చేస్తోంది. మరో గీత గోవిందం లాంటి ఫీలింగ్ ను పంచుతున్న ఫ్యామిలీ స్టార్ మూవీ విదేశాల్లో షూట్ జరుపుకుంటోంది. అక్కడ మృణాల్ తాజాగా ఒక చిట్ చాట్ లో తన మ్యారేజ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
మృణాల్ ఠాకూర్ న్యూజెర్సీ లోని స్థానిక తెలుగు ఆడియన్స్.. అండ్ అక్కడ ఉన్న మరికొంతమంది ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేశారు.ఈ కన్వర్జేషన్ సందర్భంగా..నాని హాయ్ నాన్న సినిమా తనకి చాలా స్పెషల్ మూవీ అని తెలిపింది.
Are you married' - A Kid asks Mrunal.#MrunalThakur - Soon. Soon. I will be. @mrunal0801
— Raj Paladi (@IamRajPaladi) December 7, 2023
She interacted with the audience before #HiNanna premiere at Regal Commerce Centre, New Jersey.#HiNannaReview
pic.twitter.com/GpXSbVApSk
అంతే కాకుండా ఆ సినిమాలో పోషించిన యాష్ణ క్యారెక్టర్ తన హృదయానికి చాలా దగ్గరగా ఉందని కూడా మృణాల్ చెప్పుకొచ్చింది. సీతారామం’ సమయంలోనూ నేను ఇక్కడికి వచ్చా. ‘హాయ్ నాన్న’తో ఇక్కడి ప్రేక్షకులను కలవడం అదృష్టంగా భావిస్తున్నాని ఆమె అన్నారు.
అలాగే చిట్ చాట్ టైములో..ఒక కుర్రాడు మీకు పెళ్లి అయిందా అంటూ ప్రశ్నించాడు. ఆ సమయంలో మృణాల్ నవ్వుతూ ఇంకా పెళ్లి కాలేదు. అయితే ‘త్వరలోనే..త్వరలోనే..పెళ్లి చేసుకుంటా’ అని బదులిచ్చారు. దీంతో ఆమె అభిమానులంతా..ఇప్పటికే ఆమె మనసులో ఎవరో ఉండే ఉంటారు..అంటూ సోషల్ మీడియాలో మృణాల్ పెళ్లి కామెంట్స్ వైరల్ ఆవుతోన్నాయి. ఇంతకు మృణాల్ మనసులో ఎవరైనా ఉండి ఉంటారా అనేది తెలియాల్సి ఉంది.
రీసెంట్ గా మృణాల్ హిందీలో పిప్ప అనే సినిమాలోనటించి మెప్పించింది. ఈ సినిమా ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో సాగుతుంది. ఈ సినిమా కోసం మృణాల్ ఏకంగా ఏడాది పాటు కఠిన శిక్షణ తీసుకుని గుర్తింపు తెచ్చుకుంది.ప్రస్తుతం అమెజాన్లో స్ట్రీమింగ్ అవుతోంది ఈ సినిమా.