
టాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కొత్త లుక్ ఆకట్టుకుంటోంది. సీతారామంలో వింటేజ్ లుక్లో అలరించిన మృణాల్ ఇప్పుడు నానితో ‘హాయ్ నాన్న’ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో మృణాల్, నాని మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంటుందోనని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇవాళ ఈ నటి పుట్టిన రోజు సందర్భంగా ఓ కొత్త లుక్ను మూవీ టీం విడుదల చేసింది.
ఇందులో అటు మోడ్రన్ లుక్లో మెరుస్తూనే ముక్కుపోగుతో ట్రెడిషనల్ టచ్ ఇచ్చింది. ఈ మూవీ ప్యాన్ ఇండియా రేంజ్లో డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు విజయ్ దేవరకొండ, పరశురామ్ సినిమాలో కూడా ఈ భామే హీరోయిన్గా ఫిక్స్ అయ్యింది. ఇక రెమ్యూనరేషన్ విషయంలోనూ మృణాల్ ఏమాత్రం తగ్గడం లేదట. సీతారామం సినిమాకే రెండు కోట్లు అందుకున్న ఈ హీరోయిన్.. ఇప్పుడు ఆ రేటును అమాంతం పెంచేసిందని టాక్.