
ముంబై: ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్‌కింగ్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. వరుస వైఫల్యాలతో ఇబ్బందిపడుతున్న జట్టును గట్టెక్కించేందుకు మళ్లీ ధోనీకే కెప్టెన్సీ అప్పగించింది. సీజన్‌కు ముందు అనూహ్యంగా జడేజా కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. కానీ తన నాయకత్వ లక్షణాలతో టీమ్‌ను గెలిపించలేకపోయాడు. ఫలితంగా ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో రెండే విజయాలతో ప్లే ఆఫ్ రేస్‌ను కష్టతరం చేసుకుంది. దీనికితోడు జడేజా బ్యాటింగ్, బౌలింగ్‌లోనూ విఫలంకావడంతో.. ఫ్రాంచైజీ కెప్టెన్సీ మార్పును అనివార్యం చేసింది. ‘ఇక నుంచి జడ్డూ పూర్తి స్థాయిలో ఆటపై ఫోకస్ పెడతాడు. కెప్టెన్సీ ఒత్తిడి అతనిపై ఉండదు. సారథ్యం తీసుకోవాలని మహీని కోరాడు. దానికి ఎంఎస్ కూడా అంగీకరించాడు. ఫ్రాంచైజీ, ఫ్యాన్స్, ప్లేయర్ల ఇంట్రెస్ట్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని సీఎస్‌కే పేర్కొంది.