వీడియో: బర్త్ డే కేక్ కట్ చేసి.. కుక్కలకు పెట్టిన ధోనీ

వీడియో: బర్త్ డే కేక్ కట్ చేసి.. కుక్కలకు పెట్టిన ధోనీ

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని జూలై 7న 42వ వసంతంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతని అభిమానులు.. ధోని పుట్టినరోజు వేడుకలను అంబరాన్ని అంటేలా ఘనంగా నిర్వహించారు. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో పెద్ద పెద్ద కటౌట్లు ఏర్పాటు చేసి భారీ ఎత్తున సెలబ్రేషన్స్‌ చేశారు. అయితే ధోని మాత్రం కుక్కలతో తన బర్త్ డే వేడుకలు జరుపుకున్నారు. 

ధోనీ తన ఫామ్‌హౌస్‌లో పెంపుడు కుక్కల  మధ్య  పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. నాలుగు కుక్కల మధ్య  కేక్ కట్ చేశారు. ఆపై కేక్ ముక్కలను వాటి నోటికందిస్తూ ఎంజాయ్ చేశారు. "జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన వారందరికీ కృతజ్ఞతలు.. నా పుట్టినరోజున నేను ఏమి చేశానో చూడండి.." అంటూ ధోని అందుకు సంబంధించిన వీడియోను ఇన్ స్టా వేదికగా పంచుకున్నారు.

ధోనీకి జంతువులంటే చాలా ఇష్టం

ధోనికి బైకులు, కార్లంటే ఎంత ఇష్టమో.. జంతువులన్నా అంతే ఇష్టం. రాంఛీలోని తన ఫామ్‌హౌస్‌లో చాలా పెంపుడు జంతువులు ఉన్నాయి. కుక్కలు జారా, సామ్, లిల్లీ, గబ్బర్, జోయాతో పాటు, ధోనీకి 'చేతక్' అనే గుర్రం కూడా ఉంది.