సీఎస్కే కెప్టెన్సీకి ధోని గుడ్ బై 

సీఎస్కే కెప్టెన్సీకి ధోని గుడ్ బై 

ముంబై: ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన సారథుల్లో ఒకడైన మహేంద్ర సింగ్ ధోని అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. టోర్నీ ఆరంభానికి ముందు అందరికీ షాక్ ఇస్తూ.. చెన్నై జట్టు కెప్టెన్సీ పగ్గాల నుంచి తప్పుకున్నాడు. దీంతో సీఎస్కే మేనేజ్మెంట్ టీమ్ను నడిపించే బాధ్యతలను ఆల్రౌండర్ రవీంద్ర జడేజాకు అప్పగించింది. ఈ విషయాన్ని సీఎస్కే ఫ్రాంచైజీ సోషల్ మీడియాలో కన్ఫర్మ్ చేసింది. 2012 నుంచి జట్టులో కీలక ప్లేయర్ గా ఉన్న జడేజాను కొత్త కెప్టెన్గా నియమించామని సీఎస్కే స్పష్టం చేసింది. ఈ సీజన్ తోపాటు వచ్చే పలు సీజన్లలో ధోని ప్లేయర్గా కొనసాగుతాడని పేర్కొంది. ఇకపోతే, ధోని సారథ్యంలో 2010, 2011, 2018తోపాటు 2021లో చెన్నై జట్టు ఐపీఎల్ ట్రోఫీని ఒడిసిపట్టింది. లీగ్లో అన్ని టీమ్స్ కంటే ఎక్కువగా ప్లేఆఫ్స్లో పదకొండు సార్లు, ఫైనల్స్లో తొమ్మిదిసార్లు ఆడింది. ఈ సీజన్ తొలి మ్యాచులో లాస్ట్ సీజన్ రన్నరప్ కోల్కతా నైట్ రైడర్స్తో తలపడేందుకు ఎల్లో ఆర్మీ సిద్ధమవుతోంది. 

For More News..

పెట్రో రేట్ల పెరుగుదల బీజేపీ ఆడుతున్న గేమ్

కరెంట్ చార్జీల పెంపు దారుణం 

కశ్మీరీలకు రూమ్స్ అద్దెకివ్వమన్న హోటల్