
విండీస్ టూర్ కు ధోనీ ఎంపికపై భిన్న వాదనలు
ముంబై: టీమిండియాకు రెండు వరల్డ్‌కప్‌లు అందించిన మాజీ కెప్టెన్ ధోనీ.. విండీస్ టూర్‌కు వెళ్తాడా? వెళ్లినా తుది జట్టులో ఉంటాడా? అన్న ప్రశ్నలకు భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈనెల 19న కరీబియన్ టూర్‌కు టీమ్‌ను ఎంపిక చేయనున్న నేపథ్యంలో.. ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్‌గా ధోనీని తీసుకోకపోవచ్చని బీసీసీఐ వర్గాల సమాచారం. మహీ వారసుడిగా ముద్రపడ్డ రిషబ్ పంత్‌ను మొదటి ప్రాధాన్యత వికెట్ కీపర్‌గా తీసుకుంటారని వార్తలు వెలువడుతున్నాయి. మరోవైపు ఈ టూర్‌కు దూరంగా ఉంటానని ధోనీ ఇప్పటికే బోర్డుకు సమాచారం అందించాడని తెలుస్తున్నది. దీంతో మహీని ఎంపిక చేస్తారా? లేదా? అని సందిగ్ధం నెలకొన్నా.. బోర్డులోని మరో వర్గం కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది.
2020లో జరిగే టీ20 వరల్డ్‌కప్‌ను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికిప్పుడు ధోనీని జట్టుకు దూరం చేయడం సరైంది కాదన్నది వాళ్ల అభిప్రాయం. ‘విండీస్ టూర్‌కు ఎంపిక చేసే 15 మంది జట్టులో ధోనీ ఉంటాడు. కానీ తుది 11లో అతను ఆడడు. పంత్ కుదురుకునే దాకా మహీ అండగా నిలుస్తాడు. కెప్టెన్సీలో కోహ్లీకి కూడా అతని సలహాలు, సూచనలు చాలా అవసరం. ధోనీని పూర్తిగా దూరం చేసుకోకుండా అతని మార్గదర్శకత్వంలో ఈ టూర్‌ను కొనసాగిస్తాం’ అని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కాగా, విండీస్ టూర్‌కు తాను అందుబాటులో ఉంటానని కెప్టెన్ కోహ్లీ ప్రకటించాడు. ఓటమి నుంచి త్వరగా కోలుకోవడానికి క్రికెట్ ఆడటమే సరైందన్నాడు. ఆగస్టు 3న ఫ్లోరిడా వేదికగా జరిగే తొలి టీ20తో ప్రారంభమయ్యే ఈ టూర్‌లో ఇండియా, వెస్టిండీస్‌తో మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్ట్‌లు ఆడనుంది.