గోల్ఫ్ టోర్నీలో వరల్డ్ కప్ హీరోలు

గోల్ఫ్ టోర్నీలో వరల్డ్ కప్ హీరోలు

ఒకరేమో..1983 వరల్డ్ కప్ హీరో..మరొకరేమో 2011 వరల్డ్ కప్ హీరో. మరి ఈ ఇద్దరు హీరోలు ఒక్క చోట చేరితే..ఫ్యాన్స్కు పండగే. ఈ ఇద్దరు దిగ్గజాల కలయికకు గురుగ్రామ్‌లో గ్రాంట్ థార్న్‌టన్ గోల్ఫ్ కోర్స్‌ వేదికైంది. గురుగ్రామ్‌లో కపిల్ దేవ్ గ్రాంట్ థార్న్‌టన్ గోల్ఫ్ కోర్స్‌లో టోర్నీ నిర్వహిస్తున్నారు. టోర్నీలో  కపిల్ దేవ్, ఎంఎస్ ధోని స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు.   ఈ సందర్భంగా దిగ్గజాలు సెల్ఫీ దిగారు. 

గోల్ఫ్ బంతిని కొట్టిన ధోని..
ధోని అంటే హిట్టింగ్కు పేరు. బంతిని అలవోకగా స్టాండ్ కు తరలించగల బ్యాట్స్మన్ ధోని. అయితే గోల్ఫ్ టోర్నీలో ధోని తన గోల్ఫ్ నైపుణ్యాలను ప్రదర్శించాడు. గోల్ఫ్ స్టిక్ తో బంతిని బాదిన వైనం పోటీదారులను, అభిమానులు ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయింది. 

గోల్ఫ్‌లో ధోనీ తన టాలెంట్ను  ప్రదర్శించడం ఇదే ఫస్ట్ టైం కాదు. 2019లో ధోని .. కేదార్ జాదవ్‌తో కలిసి గోల్ఫ్ సెషన్‌లను ఆస్వాదించాడు.