MS Dhoni: ఇదేనా యువతకు మీరిచ్చే సందేశం.. హుక్కా తాగుతూ కనిపించిన ఎంఎస్ ధోని

MS Dhoni:  ఇదేనా యువతకు మీరిచ్చే సందేశం.. హుక్కా తాగుతూ కనిపించిన ఎంఎస్ ధోని

భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని అంటే అందరికీ గుర్తొచ్చేది.. అతని వ్యక్తిత్వం. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే లక్షణం అతనిది. ఓడినా, గెలిచినా హంగు ఆర్భాటాలు ఏమీ ఉండవు. గెలుపోటములు సహజం అనుకుంటారు. అంతేకాదు, మ్యాచ్ జరుగుతున్నంతసేపు మైదానంలో ప్రశాంతంగా కనిపిస్తాడు. ఓర్పుగా, ఎంతో వినయంగా తన ప్రణాళికలు అమలు చేస్తుంటారు. అందుకే ధోనిని సౌమ్యుడు అని పిలుస్తుంటారు. అలాంటి మహేంద్రుడు.. ఓ పనితో నలుగురి చేత విమర్శలు ఎదుర్కొంటున్నారు.

ధోనీ హుక్కా తాగుతూ కనిపించారు. అవును.. మీరు విన్నది నిజమే. ఓ ఫంక్షన్‌కు హాజరైన ధోనీ తన స్నేహితులతో కలిసి హుక్కా పీలుస్తూ.. ఎంజాయ్ చేశారు.అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందనేది తెలియరాలేదు. తన ఫిట్‌నెస్‌ను కాపాడుకునేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకునే ధోనీ ఇలా హుక్కా తాగుతూ ఎంజాయ్ చేయటం అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది.

ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్..!

వీడియోలో కనిపిస్తున్నది ధోని కాదని, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ) సాయంతో సృష్టించిన డీప్ ఫేక్ వీడియో అని అతని అభిమానులు కామెంట్లు చేస్తుండగా.. మరొకొందరు ధోనీనే అని వాదిస్తున్నారు. ఈ విషయంపై ధోని అభిమానులకు, అతన్ని వ్యతిరేకించే వారికి సోషల్ మీడియాలో వార్ జరుగుతోంది. యువతకు రోల్ మోడల్ అయిన మహేంద్రుడు.. ఇలాంటి పనుల వల్ల అపకీర్తి తెచ్చుకుంటున్నారని విశ్లేషకులు చెప్తున్నారు.