ఎంఎస్ ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీ రీరిలీజ్‌.. ఏపీ, తెలంగాణలోనే

ఎంఎస్ ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీ  రీరిలీజ్‌..  ఏపీ, తెలంగాణలోనే

భారత క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ జీవిత కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘ఎంఎస్ ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీ’ .. ఈ మూవీ ఇప్పుడు  రీరిలీజ్‌కు సిద్ధమైంది. ఈ సినిమాను జులై 7న ధోనీ బర్త్ డే సందర్భంగా విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. అయితే  ఏపీ, తెలంగాణలో మాత్రమే ఈ చిత్రం రీరిలీజ్ కానుంది. దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, కియారా అద్వానీ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీని నీరజ్ పాండే తెరకెక్కించారు. 

రాంచీలో ఓ సాధారణ కుటుంబంలో జన్మించిన ధోని, రైల్వే టికెట్ కలెక్టర్ నుండి క్రికెటర్ కావాలన్నా లక్ష్యం వైపు ఎలా అడుగులు వేశాడు. టికెట్ కలెక్టర్‌గా జీవితం తనకు ఏం నేర్పింది. ఈ క్రమంలో ఆయనకు ఎదురైన సమస్యలెంటీ ? వాటిని ఎలా అధిగమించాడు అనేదే మిగతా సినిమా కథ. 2016 సెప్టెంబర్ 30న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్అయింది.  రూ. 106 కోట్ల బడ్జెట్‌తో రూపొందగా.. మొత్తంగా రూ. 216 కోట్లు కలెక్ట్ చేసింది.