
భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ త్వరలో రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడన్న వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. వరల్డ్ కప్ టోర్నీతో ధోనీ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నట్లు ప్రచారం కూడా జరిగింది. అయితే.. ఈ విషయంపై ధోనీ ఇప్పటివరకూ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అయితే.. ఆగస్ట్‌లో టీమిండియా వెస్టిండీస్ టూర్‌కు వెళ్లనుంది. ఈ మ్యాచ్‌లకు ఎంఎస్ ధోనీ హాజరు కావడం లేదని బీసీసీఐ వర్గాల సమాచారం. దీంతో వికెట్ కీపర్‌గా ధోనీ స్థానంలో పంత్‌ను తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలిసింది. దినేష్ కార్తీక్.. పంత్ కంటే సీనియర్ అయినప్పటికీ ఫిట్‌నెస్ సమస్య అతనిని బాధిస్తున్నందున పంత్ ను కీపర్ గా తీసుకునే అవకాశముందని బీసీసీఐ తెలిపింది. అయితే.. ఎంఎస్ ధోనీ లాంటి మార్గదర్శకుడు జట్టుకు దూరం కావడం లోటని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. విండీస్ టూర్‌కు వెళ్లబోయే జట్టును ఈ నెల 19న ప్రకటించే అవకాశముంది.
ధోనీ వెస్టిండీస్ వెళ్లినా జట్టులోని 15 మంది సభ్యుల్లో ఒకడిగా వెళతారని… గ్రౌండ్ లో ఆడే 11 మందిలో ఉండరని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.