
ముంబై : వరల్డ్ కప్ బరిలోకి దిగే టీమిండియాకు మహేంద్రసింగ్ ధోనీ ప్రధాన బలమని సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు.‘ టీమిండియాకు టాప్ 3లోఅద్భుతమైన బ్యాట్స్ మెన్ ఉన్నారు. అయితే వారు విఫలమైతే ఆ తర్వాత ధోనీ పాత్ర చాలా గొప్పది.అతను ఏ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చినా జట్టుకు అందించే పరుగులు చాలా కీలకమవుతాయి. వికెట్ కీపర్ గా ధోనీ ఏంటో అందరికీ తెలిసిందే. అయితే వికెట్ల వెనక ఉంటూ ఫీల్డింగ్ సెటప్ తోపాటు బౌలర్లకు అతనిచ్చే సూచనలు చాలా ముఖ్యమైనవి. లాంగాన్ , లాంగాఫ్ లో ఎక్కు వగా ఫీల్డింగ్ చేసే విరాట్ .. తనకు దూరంగా ఉన్న ఫీల్డ్ పొజిషన్‌ను తగిన విధంగా మార్చలేడు. ఆ పనిని మహీ చాలా సులువుగా చేస్తా డు. ఇండియాకు ఓ వరల్డ్ కప్ అందించిన ధోనీ తన అనుభవంతో జట్టు ఒత్తిడినంతా తానే తీసుకోగలడు. అందుకే జట్టులో ధోనీ పాత్రకీలకం’ అని గావస్కర్ అన్నాడు.