ధోనీ మోకాలి సర్జరీ సక్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ధోనీ మోకాలి  సర్జరీ సక్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎం.ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. ధోనీ ఎడమ మోకాలి గాయానికి నిర్వహించిన సర్జరీ సక్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యింది. ముంబైలోని కోకిలాబెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్థోపెడిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్జన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దిన్షా పరిడివాలా ఈ ఆపరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముగిసిన తర్వాత అహ్మదాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి ముంబైకి వచ్చిన మహీకి గురువారం ఉదయం ఈ సర్జరీ జరిగినట్లు తెలుస్తోంది. ‘ధోనీకి విజయవంతంగా సర్జరీ జరిగింది. పోస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆపరేషన్​ నుంచి అతను  కోలుకుంటున్నాడు. 

రెండు, మూడు రోజుల్లో హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి డిశ్చార్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవుతాడు. కొన్ని రోజుల విశ్రాంతి తర్వాత ఇంటెన్సివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిహాబిలిటేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మొదలుపెడతాడు. వచ్చే ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అందుబాటులో ఉండేందుకు అతనికి చాలా టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉంది. ఆలోగా పూర్తి ఫిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సాధిస్తాడు’ అని సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెల్లడించాడు. మోకాలి గాయంతోనే మహీ ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అన్ని మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఆడిన సంగతి తెలిసిందే. ఇక కారు ప్రమాదంలో గాయపడిన రిషబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు ఎంతో మంది ఇండియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రికెటర్లకు దిన్షా పరిడివాలా సర్జరీలు చేసి గాయాలు నయం చేశారు.