9,168 మందికి బీఫార్మసీ ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు

9,168 మందికి బీఫార్మసీ ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు
  • 9,168 మందికి బీఫార్మసీ 
  •  ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు

హైదరాబాద్, వెలుగు : ఎంసెట్ (బైపీసీ) అడ్మిషన్ కౌన్సెలింగ్ ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటా యింపు ప్రక్రియ పూర్తయింది. మొత్తం 17,713 మంది వెబ్ ఆప్షన్లు ఇవ్వగా, వారిలో 9,168 మందికి సీట్లు అలాట్ అయ్యాయి. కేవలం 194 మాత్రమే సీట్లు మిగిలాయి. కాగా, బీఫార్మసీలో 119 కాలే జీల్లో 7,790 సీట్లకు 7,597 సీట్లు నిండగా, ఫార్మ్​డీలో 65 కాలేజీల్లో 1,343 సీట్లకు 1,342 సీట్లు భర్తీ అయ్యాయి. 

బయోమె డికల్ ఇంజినీరింగ్, ఫార్మాస్యూటికల్ ఇంజినీరింగ్, బయో టెక్నాలజీ తదితర కోర్సుల్లో 229 సీట్లకుగానూ 229 సీట్లూ నిండాయి. ఆప్షన్లు ఇచ్చిన 8,545 మందికి సీట్లు అలాట్ కాలేదు. 80 కాలేజీల్లో వందశాతం సీట్లు నిండాయి. సీట్లు పొందిన అభ్యర్థులు ఈనెల 14 వరకూ  పేమెంట్ చేసి, సెల్ఫ్ రిపోర్ట్ చేయాలని అధికారులు సూచించారు.