వ్యాపారంపై అవగాహన  కలిగి ఉండాలి : డైరెక్టర్‌‌ నవీన్‌‌ కుమార్‌‌

వ్యాపారంపై అవగాహన  కలిగి ఉండాలి : డైరెక్టర్‌‌ నవీన్‌‌ కుమార్‌‌
  • ఎంఎస్‌‌ఎంఈ  డీఎఫ్‌‌వో అసిస్టెంట్‌‌ డైరెక్టర్‌‌ నవీన్‌‌ కుమార్‌‌

సూర్యాపేట, వెలుగు: వ్యాపారంపై అవగాహన కలిగి ఉండాలని ఎంఎస్‌‌ఎంఈ  డీఎఫ్‌‌వో అసిస్టెంట్‌‌ డైరెక్టర్‌‌ నవీన్‌‌ కుమార్‌‌ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో ఎంఎస్‌‌ఎంఈ డీఎఫ్‌‌వో ప్రధాన మంత్రి విశ్వకర్మ పథకం లబ్ధిదారుల కోసం మార్కెటింగ్‌‌పై జరిగిన అవగాహన సదస్సులో మాట్లాడారు. ప్రధాన మంత్రి విశ్వకర్మ పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని వ్యాపార రంగంలో అభివృద్ధి చెందాలన్నారు. ఈ సందర్భంగా 45 మంది లబ్ధిదారులకు క్యూఆర్‌‌ కోడ్‌‌ ఆన్‌‌ బోర్డింగ్‌‌ డిజిటల్‌‌ పేమెంట్స్‌‌, ఇండియా పోస్టల్‌‌ పేమెంట్స్‌‌ బ్యాంకు సులభతరం చేశారు.

వ్యాపారాల్లో  నూతన పద్ధతులను తెలియజేశారు. కార్యక్రమంలో జీఎం డీఐసీ  సీతారాం నాయక్, లీడ్ బ్యాంకు మేనేజర్ నాగప్రసాద్‌‌, డీపీఎంయూ మణి, ఐపీపీబీ  సీనియర్ మేనేజర్ రాజేష్‌‌,  ఈడీసీ మేనేజర్ ఎన్ఐఎం ఎస్ఎంఈ నరేష్‌‌, తదితరులు పాల్గొన్నారు.