
సిటీలో మూడో రోజు ముద్ద పప్పు బతుకమ్మ వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. జూబ్లీహిల్స్ రహమత్ నగర్లో జరిగిన ఉత్సవాలకు మంత్రి వివేక్ వెంకటస్వామి దంపతులు హాజరయ్యారు. గాంధీ భవన్లో టీపీసీసీ ఎన్నారై సెల్ ఆధ్వర్యంలో గల్ఫ్ సంక్షేమ బతుకమ్మ వేడుకలు నిర్వహించగా, బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో చార్మినార్ వద్ద జరిగిన ఉత్సవాల్లో తమిళనాడు బీజేపీ నేత, సినీ నటి కుష్బూ పాల్గొన్నారు. ఓయూ ఆర్ట్స్ కాలేజీ, నారాయణ గూడలోని కేఎంఐటీలో జరిగిన వేడుకల్లో విద్యార్థులు ఉత్సాహంగా బతుకమ్మ ఆడిపాడారు.
వెలుగు, హైదరాబాద్ సిటీ