విద్య, ఉద్యోగాల్లో చట్టబద్ధ వాటా ఇవ్వాలి: ముదిరాజ్ చైతన్య వేదిక డిమాండ్

విద్య, ఉద్యోగాల్లో చట్టబద్ధ వాటా ఇవ్వాలి: ముదిరాజ్ చైతన్య వేదిక డిమాండ్

ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ముదిరాజ్ ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ముదిరాజ్ చైతన్య వేదిక డిమాండ్ చేసింది. ఆదివారం హైదరాబాద్‌లోని బీసీ సాధికారత భవన్ లో  చైతన్య వేదిక ఆధ్వర్యంలో ముదిరాజ్ లకు రాజ్యాంగం కల్పించిన హక్కుల సాధనకు మేథోమదన సదస్సు జరిగింది. వేదిక కార్యవర్గ సభ్యుడు శివ ముదిరాజ్ మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యధికంగా ముదిరాజ్ లు ఉన్నా విద్య, ఉద్యోగాల్లో చట్టబద్ధంగా రావాల్సిన వాటాకు ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నామన్నారు. 

ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ముదిరాజ్ చైతన్య వేదిక రాష్ట్ర మహిళా నాయకురాలు కోట్ల పుష్పలత, నేతలు రమేష్, కురుమూర్తి, సీతామాలక్ష్మి, సురేష్, వెంకటేశ్, నరసింహ, వెంకన్న, రవీందర్, మహేశ్​, విజయ్   పాల్గొన్నారు.