సత్య నాదెళ్ల, సుందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పిచయ్‌‌‌‌‌‌‌‌, మస్క్‌‌‌‌‌‌‌‌ను దాటిన అంబానీ

సత్య నాదెళ్ల, సుందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పిచయ్‌‌‌‌‌‌‌‌, మస్క్‌‌‌‌‌‌‌‌ను దాటిన అంబానీ

 

  • టాప్ సీఈఓల్లో  రెండో ప్లేస్‌‌‌‌‌‌‌‌
  • వెల్లడించిన బ్రాండ్ గార్డియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ బాస్‌‌‌‌‌‌‌‌ ముకేశ్ అంబానీ దేశంలోనే  టాప్‌‌‌‌‌‌‌‌ సీఈఓగా అవతరించారు. గ్లోబల్‌‌‌‌‌‌‌‌గా మైక్రోసాఫ్ట్ సత్య నాదెళ్ల, గూగుల్ సీఈఓ సుందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పిచయ్‌‌‌‌‌‌‌‌, యాపిల్ టిమ్‌‌‌‌‌‌‌‌ కుక్‌‌‌‌‌‌‌‌, టెస్లా ఎలన్ మస్క్  వంటి   సీఈఓలను దాటి రెండో ప్లేస్‌‌‌‌‌‌‌‌ను  దక్కించుకున్నారు. బ్రాండ్ గార్డియన్‌‌‌‌‌‌‌‌షిప్ ఇండెక్స్ 2024 ప్రకారం, టెన్సంట్‌‌‌‌‌‌‌‌ కంపెనీ సీఈఓ హుటాంగ్ మా  టాప్ సీఈఓగా నిలిచారు.

ఉద్యోగులు, ఇన్వెస్టర్లు, సొసైటీ మధ్య బ్యాలెన్స్‌‌‌‌‌‌‌‌ కొనసాగిస్తూ బిజినెస్‌‌‌‌‌‌‌‌ను డెవలప్ చేసిన  గ్లోబల్ సీఈఓలతో  ఇండెక్స్‌‌‌‌‌‌‌‌ను  బ్రాండ్ గార్డియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ రిలీజ్ చేస్తోంది. టాటా సన్స్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌ ఎన్‌‌‌‌‌‌‌‌ చంద్రశేఖరన్‌‌‌‌‌‌‌‌   ఐదో ప్లేస్‌‌‌‌‌‌‌‌లో నిలిచారు. కిందటేడాది ర్యాంకింగ్స్‌‌‌‌‌‌‌‌లో ఆయన 8 వ ప్లేస్‌‌‌‌‌‌‌‌ పొందారు.  మహీంద్రా అండ్ మహీంద్రా సీఈఓ అనీశ్​ షా ఆరో ప్లేస్‌‌‌‌‌‌‌‌లో, ఇన్ఫోసిస్ సలీల్ పరేఖ్16 వ ప్లేస్‌‌‌‌‌‌‌‌లో ఉన్నారు. కిందటేడాది ర్యాంకింగ్స్‌‌‌‌‌‌‌‌లో కూడా అంబానీ గ్లోబల్‌‌‌‌‌‌‌‌గా రెండో ప్లేస్‌‌‌‌‌‌‌‌ దక్కించుకున్నారు.  

‘డైవర్సిఫైడ్ కాంగ్లమరేట్స్‌‌‌‌‌‌‌‌’ విభాగంలో అంబానీ మొదటి ప్లేస్ దక్కించుకున్నారు. బ్రాండ్ ఫైనాన్స్ సర్వే అంబానీకి 80.3 స్కోర్ ఇచ్చింది. చైనీస్ బిజినెస్‌‌‌‌‌‌‌‌ మ్యాన్ హుటాంగ్‌‌‌‌‌‌‌‌ మాకు 81.6 స్కోర్ వచ్చింది. కంపెనీ బ్రాండ్‌‌‌‌‌‌‌‌ను విస్తరించడంలో సీఈఓ పాత్ర, ఆయన సమర్థతను ఆధారంగా ఈ స్కోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బ్రాండ్ ఫైనాన్స్‌‌‌‌‌‌‌‌ ఇచ్చింది. ఈ సారి సీఈఓ ర్యాంకింగ్స్‌‌‌‌‌‌‌‌లో  సస్టయినబిలిటీకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు.