అందుకే జియోతో ఒప్పందం జుకర్ బర్గ్

అందుకే జియోతో ఒప్పందం జుకర్ బర్గ్
  • వరల్డ్ లోనే భారత్ అతిపెద్ద డిజిటల్ సోసైటీగా మారుతుందన్న ముఖేష్

ఇండియాలో చిన్న వ్యాపారులకు మరిన్ని వాణిజ్య అవకాశాలను అందించేందుకే జియోతో ఫేస్ బుక్ కలిసి పనిచేయనుందని మార్క్ జుకర్ బర్గ్ తెలిపారు. ఇండియా పూర్తిగా డిజిటల్ గా మారుతున్న నేపథ్యంలో చిన్న వ్యాపారులకు మేలు చేసే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. జియో తో ఒప్పందానికి సంబంధించి జుకర్ బర్గ్ ఓ వీడియో మెస్సేజ్ ను రిలీజ్ చేశారు. ఈ డీల్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఉత్సాహంగా ఎదురుచూస్తున్నానని అన్నారు. ఈ డీల్ లో అవకాశం ఇచ్చినందుకు ముఖేష్ అంబానీకి కృతజ్ఞతలు తెలిపారు. ఫేస్ బుక్ కు చెందిన మెసేజింగ్ యాప్, వాట్సాప్, రిలయన్స్ ఆధీనంలోని ఈ కామర్స్ వెంచర్ జియో మార్ట్ లు కూడా కో ఆర్డినేషన్ లో పనిచేస్తామన్నారు. రిలయన్స్ జియో లో 9.99 శాతం వాటా కోసం 5.7 బిలియన్ డాలర్లతో ఫేస్ బుక్ అగ్రిమెంట్ చేసుకుంది. పెట్టుబడుల ఒప్పందాన్ని చేసుకుంది.
డిజిటల్ ఇండియా కల నెరవేరుతుంది
జియో లో ఫేస్ బుక్ పెట్టుబడులు పెట్టటంపై ముఖేష్ అంబానీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందంతో వరల్డ్ లోనే ఇండియా అతిపెద్ద డిజిటల్ సోసైటీగా మారుతుందన్నారు. ఫేస్ బుక్ తో అగ్రిమెంట్ కు సంబంధించి ముఖేష్ అంబానీ వీడియో మెస్సేజ్ ను విడుదల చేశారు. ఇండియా డిజిటల్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఫేస్ బుక్ తో కలిసి పనిచేస్తామని చెప్పారు.