కేంద్రం ప్రతిపాదనను తిరస్కరించిన రోహత్గి

కేంద్రం ప్రతిపాదనను తిరస్కరించిన రోహత్గి

కేంద్ర ప్రభుత్వం ఇటీవల సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి మరోసారి అటార్నీ జనరల్ గా బాధ్యతలు చేపట్టాలంటూ ఆఫర్ ఇచ్చింది. అయితే తాజాగా ఈ ప్రకటనపై ఆయన స్పందించారు. కేంద్రం ఇచ్చిన ఆఫర్ ని తిరస్కరిస్తున్నట్టు వెల్లడించారు. ఈ నిర్ణయం వెనక ప్రత్యేకించి కారణమేమీ లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం కేకే వేణుగోపాల్ ఏజీగా కొనసాగుతుండగా ఆయన పదవీకాలం ఈ నెల 30తో ముగియనుంది. దీంతో రోహత్గి పేరును ఇటీవల కేంద్రం ప్రతిపాదించింది. 

గతంలో 2014 జూన్ నుంచి 2017 జూన్ వరకు రోహత్గి ఏజీగా పనిచేశారు. ఆ తర్వాత మళ్లీ జులైలో కేంద్రం కేకే వేణుగోపాల్ ను ఏజీగా నియమించింది. మరికొద్ది రోజుల్లో ఆయన పదవీకాలం ముగిస్తుండగా వేణుగోపాల్ వయసు ఇప్పటికే 89ఏళ్లు కాగా.. ఆయన దృష్టిలో పెట్టుకొని అప్పట్లో ఆయనే కేంద్రాన్ని కోరారు. దీంతో మరో మూడేళ్ల పాటు పదవిలో కొనసాగాలని కేంద్రం అభ్యర్థించింది. ఇటీవల ముకుల్ రోహత్గి పేరును కేంద్రం ప్రతిపాదించడంతో ఆయన తాజాగా తిరస్కరించారు. ఇక తదుపరి ఏజీగా కేంద్ర నియామకంపై ఆసక్తి నెలకొంది.