కూకట్ పల్లిలో రూ.3 లక్షల బంగారం కొంటే.. గోల్డ్కాయిన్ ఫ్రీ !

కూకట్ పల్లిలో రూ.3 లక్షల బంగారం కొంటే.. గోల్డ్కాయిన్ ఫ్రీ !
  • కేపీహెచ్​బీలో ముకుంద జ్యువెల్లరీ ప్రారంభోత్సవ ఆఫర్​

కూకట్​పల్లి, వెలుగు : తమ దగ్గర రూ.3 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు కొంటే 22 క్యారెట్ల అర గ్రాము గోల్డ్​కాయిన్​ ఉచితంగా ఇవ్వనున్నట్టు ప్రముఖ బంగారు ఆభరణాల సంస్థ ముకుంద జ్యువెల్లరీ నిర్వాహకులు ప్రకటించారు. కేపీహెచ్​బీకాలనీలో శనివారం ముకుంద పూర్వి పేరిట కొత్త షోరూంను ప్రారంభించారు. ఈ సందర్భంగా  ఆ సంస్థ చైర్మన్​నరసింహారెడ్డి మాట్లాడుతూ  ప్రారంభోత్సవ ఆఫర్​కింద నవంబర్​1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు రూ.3 లక్షల విలువైన బంగారం కొంటే అర గ్రాము విలువైన గోల్డ్​కాయిన్​ఇస్తామని ప్రకటించారు. 

ఇన్​స్టాలో ‘పూర్వీ’ ఇన్​స్టా గ్రామ్​పేజీ ఫాలో అయితే 5 గ్రాముల వెండి ఉచితంగా ఇస్తామన్నారు. అయితే, ఇది మొదటి మూడు రోజులే ఉంటుందని, అది కూడా వెయ్యి మందికి మాత్రమే ఉంటుందని ప్రకటించారు. సంస్థ సీఈవో నిఖితారెడ్డి, డైరెక్టర్​ కృష్ణ పాల్గొన్నారు.