
ముల్కనూరు. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అందరి ప్రశంసలు అందుకుంటున్న ఊరు. ప్రభుత్వ స్కూల్స్ లో పిల్లలను చదివించిన వారికే పంచాయతీ ధ్రువ పత్రాలు, ప్రభుత్వ స్కీంలు అందుతాయని తీర్మాణించడంతో ముల్కనూరు హాట్ టాపిక్ అయ్యింది. రేషన్ కావాలి, పెన్షన్, ఫీజ్ రియంబర్స్మెంట్ ,కుల వృత్తిపై రాయితీ, ఆరోగ్య శ్రీ,, వ్యవసాయానికి బ్యాంకు లోన్, తిసుకున్న లోన్ మాఫీ, 100 రోజుల ఉపాది హామీ పని. ఇలాంటివాటి దగ్గర మాత్రం తాము పేదవళ్లమని చెప్పే గ్రామస్థులు.. … మీ పిల్లవాడిని ప్రభుత్వ పాఠశాలలో చేర్చితే తప్పేంటని చర్చించుకున్నారు. దీంతో ఆ స్కూల్లోకి వచ్చే ప్రైవేట్ స్కూల్ బస్సులను రాకుండా చేశారు.
1వ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ స్టూడెంట్ కోసం వచ్చే ప్రైవేట్ వాహనాలు గ్రామంలోకి అనుమతించబడవు అని ప్రకటించింది గ్రామం. అలాగే గ్రామంలోని ప్రభుత్వ స్కూల్ లో చదవని 1-10వ తరగతి పిల్లలకు గ్రామ పంచాయతీ నుంచి ఎలాంటి సర్టిఫికెట్స్ ఇవ్వబడవు అని సంచలన ప్రకటన చేశారు ముల్కనూరు సర్పంచ్. పిల్లలను సర్కార్ స్కూల్స్ కు పంపనప్పుడు ..ప్రభుత్వం నుంచి వచ్చే స్కీంమ్స్ కూడా పొందవద్దని ముల్కనూరు గ్రామ పంచాయతీ తీర్మాణించింది. ప్రస్తుతం ఈ న్యూస్ హాట్ టాపిక్ అయ్యింది. రాష్ట్రంలోని గ్రామాలకు ముల్కనూరు ఆదర్శంగా నిలిచి అందరిచేత ప్రశంసలు అందుకుంటుంది.
వరంగల్ అర్భన్ జిల్లా బీమదేవరపల్లి మండలంలో ఉన్న గ్రామమే ముల్కనూరు.