
హీరోయిన్‌గా వరుస సక్సెస్‌లు అందుకుని టాలీవుడ్‌తో పాటు పాన్ ఇండియా స్థాయిలోనూ గుర్తింపును అందుకుంది అనుపమ పరమేశ్వరన్. ఇప్పుడు తనలోని మరో టాలెంట్‌ని ప్రూవ్ చేసుకుని మల్టీ టాలెంటెడ్ అనిపించుకుంటోంది. తనలో మంచి ప్రొఫెషనల్ సినిమాటోగ్రాఫర్ కూడా ఉందని ప్రూవ్ చేసుకుంది. సంకల్ప్ గోరా దర్శకత్వం వహించిన ‘ఐ మిస్ యు’ అనే షార్ట్ ఫిల్మ్‌తో డీవోపీగా మారి ఆశ్చర్య పరిచింది అనుపమ. ఈ షార్ట్ ఫిల్మ్ చాయ్ బిస్కెట్ యూట్యూబ్ ఛానెల్‌లో విడుదల అయ్యింది. ఈ షార్ట్ ఫిల్మ్‌లో అనుపమ కెమెరా వర్క్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే కొందరు హీరోయిన్స్ యాక్టింగ్‌తో పాటు డైరెక్షన్, మ్యూజిక్ అంటూ డిఫరెంట్ సెక్టార్స్‌లో తమ టాలెంట్ ప్రూవ్ చేసుకున్నారు. సినిమాటోగ్రాఫర్‌గా మారిన ఫస్ట్ హీరోయిన్‌గా అనుపమ పేరు నిలిచిపోతుంది. ఆమెకు డైరెక్షన్ చేయాలనే కోరిక కూడా ఉన్నట్టు గతంలో తెలిపింది. అయితే దానికి ఇంకా టైమ్ ఉందని చెప్పిన అనుపమ.. ప్రస్తుతం తమిళ, మలయాళ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.