
మయన్మార్, టిబెట్, ఆఫ్ఘనిస్తాన్ లను భూకంపం వణికించింది. శనివారం(జూలై 19) రిక్టర్ స్కేల్ లపై మయన్మార్ లో 3.7 తీవ్రత, టిబెట్ లో 3.6 తీవ్రత, ఇక ఆఫ్ఘనిస్తాన్ లో శనివారం ఒక్క రోజే వరుసగా 125 కి.మీ,190 కి.మీ లోతులో 4.0 ,4.2 తీవ్రతతో రెండు భూకంపం సంభవించింది.
గత మూడు రోజులుగా తరుచుగా భూమికంపిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది. మయన్మార్, టిబెట్ ,ఆఫ్ఘనిస్తాన్ జూలై 17 నుంచి 19 మధ్య వరుస భూకంపాలను చవిచూశాయి. మయన్మార్ మూడు భూకంపాలతో అతలాకుతలమైంది. టిబెట్ రెండు భూకంపాలతో కుప్పకూలింది. 48 గంటల్లో ఆఫ్ఘనిస్తాన్ నాలుగు భూకంపాలను చవిచూసింది. ఇది ఈ ప్రాంతం భూకంప దుర్బలత్వాన్ని హైలైట్ చేసింది.
48 గంటల వ్యవధిలో ఆఫ్ఘనిస్తాన్‌లో నాలుగు భూకంపాలు సంభవించాయి. శనివారం ఒక్క రోజే, వరుసగా 125 కి.మీ ,190 కి.మీ లోతులో 4.0 ,4.2 తీవ్రతతో రెండు భూకంపాలు సంభవించాయి.
టిబెట్ కూడా రెండు భూకంపాలతో వణికిపోయింది. శనివారం 3.6 తీవ్రతతో భూకంపం కేవలం 10 కి.మీ లోతులో సంభవించింది. దీని వలన అది మరోసారి టిబెట్ లో భూప్రకంపనలకు అవకాశం ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది.
మయన్మార్‌లో వరుసగా మూడు రోజుల్లో మూడు భూకంపాలు సంభవించాయి. శనివారం 3.7 తీవ్రతతో భూకంపం 105 కి.మీ లోతులో సంభవించింది.
ఈ మూడు దేశాలలో సంభవించే ప్రకంపనలు ఈ ప్రాంతం మధ్యస్థ ,భారీ తీవ్రతతో కూడిన భూకంపాలకు గురయ్యే అవకాశం ఉందని గుర్తు చేస్తుంది.
ముఖ్యంగా, జనాభా ఉన్న ప్రాంతాలకు సమీపంలో తీవ్రమైన భూమి కంపనం కారణంగా ఎక్కువ ముప్పును కలిగించే అవకాశం ఉందని NCS అంచనా వేస్తోంది.