ములుగు, భూపాలపల్లి కలెక్టర్ల ఫేక్ వాట్సప్ అకౌంట్లు..అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన

ములుగు, భూపాలపల్లి కలెక్టర్ల ఫేక్ వాట్సప్ అకౌంట్లు..అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన
  • మెసేజ్ లు వస్తే సైబర్ పోలీసులకు కంప్లయింట్ చేయాలని కోరిన కలెక్టర్లు

ములుగు, వెలుగు : తన ప్రొఫైల్​ఫొటోను ఫేక్ వాట్సప్ అకౌంట్ కు పెట్టుకుని కొందరు దుండగులు అధికారులు, ప్రజలకు మెసేజ్ లు  పంపుతున్నారని, అప్రమత్తంగా ఉండాలని ములుగు కలెక్టర్ దివాకర టీఎస్​సూచించారు. మంగళవారం ఆయన మీడియాకు వివరాలు తెలిపారు. మోసగాళ్ల మెసేజ్ లను నమ్మి ఎలాంటి డబ్బులు పంపొద్దని, ఎవరైనా పంపితే వెంటనే నంబర్లను బ్లాక్​ చేసి, సైబర్​పోలీసులకు లేదా స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు.  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్​సూచించారు.  

జయశంకర్​ భూపాలపల్లి : సోషల్ మీడియాలో  భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ ఫొటోను డీపీగా పెట్టుకుని ఫేక్ వాట్సప్ అకౌంట్ ను ఓపెన్​చేశారు. ఫేక్​ అకౌంట్ నుంచి వచ్చే మెసేజ్ లకు స్పందించవద్దని ఆఫీసర్లు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్​శర్మ సూచించారు. తన ఫొటోను ప్రొఫైల్ గా పెట్టుకుని కొందరు వాట్సాప్​ మెసేజ్ లు పంపుతూ డబ్బులు అడుగుతున్నారని, ఇలాంటివాటిని రెస్పాండ్ కావొద్దని కోరారు.  ఎవరికైనా మెసేజ్ లు వస్తే వెంటనే బ్లాక్​ చేసి సైబర్ పోలీసులకు కంప్లయింట్ చేయాలని కలెక్టర్ సూచించారు.