రీల్స్‌‌‌‌‌‌‌‌ తో ములుగు పర్యాటక అందాలు ప్రపంచవ్యాప్తం కావాలి : కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవ రావు

రీల్స్‌‌‌‌‌‌‌‌ తో ములుగు పర్యాటక అందాలు ప్రపంచవ్యాప్తం కావాలి : కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవ రావు

ములుగు, వెలుగు : ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లుయెన్సర్లు రీల్స్‌‌‌‌‌‌‌‌తో ములుగు జిల్లా పర్యాటక అందాలను ప్రపంచవ్యాప్తం చేయాలని, లోకల్ టు గ్లోబల్‌‌‌‌‌‌‌‌గా ములుగు జిల్లా ఘన కీర్తిని ప్రపంచానికి పరిచయం చేయాలని కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు పిలుపునిచ్చారు. గురువారం కలెక్టర్ లో కలెక్టర్​ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లుయెన్సర్ రీల్స్ కాంపిటీషన్ పై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జిల్లాలోని టూరిజంను ప్రపంచానికి పరిచయం చేసేందుకు నిర్వహిస్తున్న ఈ కాంపిటీషన్‌‌‌‌‌‌‌‌పై ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లుయెన్సర్లు, మీడియా ప్రతినిధులు, సోషల్ మీడియా హ్యాండ్లర్లతో చర్చించారు. 

ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక పర్యాటక వారోత్సవాలలో భాగంగా తొలిసారిగా వినూత్న పద్ధతిలో ములుగు జిల్లాలోని అనేక పర్యాటక ప్రాంతాలకు బ్రాండింగ్ కలిగించే విధంగా 'ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లుయెన్సర్ రీల్స్ కాంపిటీషన్' నిర్వహింస్తున్నామని తెలిపారు. ములుగు జిల్లా పర్యాటక ప్రాంతాలపై 4కేవీడియో క్వాలిటీతో రీల్స్ సమర్పించాల్సి ఉంటుందని, ఆసక్తి ఉన్నవారు తమ వీడియోలను ఈనెల 21 నుంచి 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు జిల్లా పౌర సంబంధాల శాఖ ఆఫీస్​లో సమర్పించాలన్నారు. ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ విధానంలో డీపీఆర్వో రఫీక్ 99483 92976, ఏపీఆర్ఓ వేణు 9494970535 కు వాట్సాప్ ద్వారా పంపించవచ్చని పేర్కొన్నారు. గెలుపొందిన వారికి జూన్ 2న బహుమతులు అందిస్తామని పేర్కొన్నారు.