క్రీడలు స్నేహ భావాన్ని పెంపొందిస్తాయి : డీఈవో సిద్ధార్థ రెడ్డి

క్రీడలు స్నేహ భావాన్ని పెంపొందిస్తాయి : డీఈవో సిద్ధార్థ రెడ్డి

ములుగు, వెలుగు: క్రీడలు స్నేహభావాన్ని పెంపొందిస్తాయని, క్రీడాస్ఫూర్తితో ముందుకు వెళ్లాలని ములుగు డీఈవో సిద్ధార్థ రెడ్డి అన్నారు. ఉమ్మడి జిల్లా అండర్​–14 విభాగం కబడ్డీ టోర్నమెంట్, ఎంపిక క్రీడలు రెండు రోజులుగా ములుగు మండలం జాకారం సోషల్​ వెల్ఫేర్​ పాఠశాలలో నిర్వహిస్తున్నారు. ఈ క్రీడల్లో జనగామ, హనుమకొండ, వరంగల్​, ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్​ జిల్లాల క్రీడాకారులు 200లమంది పాల్గొన్నారు. 

ముఖ్య అతిథిగా డీఈవోతోపాటు టోర్నమెంట్​బహుమతి ప్రదాత కుంజ సూర్య హాజరై క్రీడలను ప్రారంభించారు. వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలన్నారు. అనంతరం 14 ఏళ్ల విభాగంలో రాష్ట్రస్థాయికి క్రీడాకారులను ఎంపిక చేశారు. ఎంపికైన క్రీడాకారులకు టీషర్ట్స్, షూలు అందజేస్తానని మంత్రి సీతక్క కుమారుడు కుంజ సూర్య తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్​ వెంకటేశ్వర్లు, క్రీడా కార్యదర్వి బల్గూరి వేణు, వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు గుండెబోయిన మల్లయ్య గౌడ్, స్పోర్ట్స్​ఆఫీసర్ ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.