ములుగు, వెలుగు : సర్పంచ్‌గా గెలవాలన్న లక్ష్యంతో క్యాండిడేట్లు వినూత్న హామీలు ఇస్తున్నారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలో సర్పంచ్ స్థానానికి బీజేపీ తరఫున వినుకోలు ధనలక్ష్మి బరిలో నిలిచారు. ఎలాగైనా ఓటర్లను ఆకర్షించాలన్న లక్ష్యంతో.. తనను గెలిపిస్తే ఐదేండ్ల పాటు గ్రామస్తులందరికీ ఫ్రీ వైఫైతో పాటు టీవీ చానళ్లను అందిస్తానంటూ హామీ ఇస్తున్నారు. అలాగే గోదావరి కరకట్ట నిర్మాణం, తూముల లీకేజీలు అరికడతామని పేర్కొన్నారు. అన్ని హామీలతో బాండ్ పేపర్ రాసి ప్రచారం చేస్తున్నారు.
