అసాంఘిక శక్తులకు ఆశ్రయమివ్వొద్దు : ఎస్పీ శబరీశ్

అసాంఘిక శక్తులకు ఆశ్రయమివ్వొద్దు : ఎస్పీ శబరీశ్

ములుగు(గోవిందరావుపేట), వెలుగు: జనావాసాలకు దూరంగా జీవిస్తున్న గొత్తికోయ గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, అసాంఘిక శక్తులకు ఆశ్రయమివ్వొద్దని ములుగు ఎస్పీ శబరీశ్ సూచించారు. గోవిందరావుపేట మండలం పసర సమీపంలోని బూడిద గడ్డ గొత్తికోయ గుంపును సందర్శించిన ఆయన సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. 

గుర్తుతెలియని వ్యక్తులు గూడాలకు వస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఈ సందర్భంగా చిన్నారులకు చాక్లెట్లు, బిస్కెట్లు పంపిణీ చేసిన పోలీసులు పిల్లలకు ఆన్లైన్ లో విద్యాబోధన కోసం టీవీలు ఏర్పాటు చేస్తామన్నారు.