భక్తులకు ఇబ్బంది లేకుండా బిజినెస్​ చేసుకోవాలె

భక్తులకు ఇబ్బంది లేకుండా బిజినెస్​ చేసుకోవాలె
  • ములుగు ఎస్పీ సంగ్రాం సింగ్​ జి పాటిల్​ 
  • మేడారంలో షాపులను పరిశీలించిన ఐపీఎస్​ ఆఫీసర్​

ఏటూరునాగారం, వెలుగు: మేడారం మహా జాతరలో స్టాల్స్​ ఏర్పాటు చేసుకున్న వ్యాపారులు భక్తులకు ఇబ్బందులు కలుగకుండా బిజినెస్​ చేసుకోవాలని ములుగు ఎస్పీ సంగ్రాం సింగ్​గణపతి పాటిల్​సూచించారు. సోమవారం ఆయన రోప్​ పార్టీతో కలిసి గద్దెల దగ్గరి నుంచి జంపన్నవాగు వరకు ఉన్న స్టాల్స్​ను పరిశీలించారు. ఈ సందర్భంగా కొంతమంది వ్యాపారులు రోడ్డుపైకి వచ్చి బిజినెస్​ చేస్తుండడాన్ని గమనించారు. జంపన్న వాగు నుంచి గద్దెల వరకు వచ్చే రూట్​లో రోడ్డుపైకి ఉన్న కొన్ని స్టాల్స్ ని స్వయంగా పక్కకు జరిపించారు. దుకాణదారులు రోడ్డుపై స్టాల్స్ పెట్టి భక్తులకు ఇబ్బంది కలిగించవద్దన్నారు. వారికి ఎంతమేరకైతే షాపులు కేటాయించారో, అదే ప్లేసుల్లో వ్యాపారాలు చేసుకోవాలని కోరారు. ఒకవేళ ఎవరైనా రూల్స్ బ్రేక్ చేసినట్టు తన దృష్టికి వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మహబూబాబాద్ ఎస్పీ శరత్ పవర్, ఏఎస్పీలు సుధీర్ రాంనాథ్, ఆశోక్​ కుమార్​, డీఎస్పీ దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు.