మేడారం జాతరకు ట్రాఫిక్ సమస్య తలెత్తొద్దు : ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్

మేడారం జాతరకు ట్రాఫిక్ సమస్య తలెత్తొద్దు : ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్
  •     ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్​ 

ములుగు, వెలుగు : జనవరిలో జరిగే మేడారం జాతరకు ట్రాఫిక్​ సమస్య తలెత్తకుండా చూడాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్​ కేకన్ పోలీస్​ అధికారులకు సూచించారు. ఆదివారం ములుగులోని జాతీయ రహదారి 163 వెంట డీఎఫ్​వో రాహుల్ కిషన్​ జాదవ్​ తో కలిసి గట్టమ్మతోపాటు వివిధ ప్రాంతాలను ఎస్పీ పరిశీలించి మాట్లాడారు. మేడారం సమ్మక్క సారక్క జాతర జనవరి 28 నుంచి31వరకు జరగనుందని, మొదట గట్టమ్మ దేవాలయనికి భక్తులు అధిక సంఖ్యలో వస్తారన్నారు. 

వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించి భక్తులకు అసౌకర్యం కలుగకుండా ప్రత్యామ్నాయ రహదారిని ఏర్పాటు చేసేందుకు డీఎఫ్​వోతో చర్చించారు. ప్రభుత్వ,  ప్రైవేటు వాహనాల పార్కింగ్​పై ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. ట్రాఫిక్ నియంత్రణ, యాక్సిడెంట్ల నివారణ తదితర అంశాలపై భక్తులకు అవగాహన కల్పిస్తామన్నారు.  కార్యక్రమంలో డీఎస్పీ రవీందర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ డి.శంకర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్​స్పెక్టర్ శంకర్, ములుగు సీఐ సురేశ్, ఎస్సై వెంకటేశ్వర్లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.