ములుగు, వెలుగు: పేదరికం, గ్రామీణ నేపథ్యం, గిరిజన ప్రాంతం అనే పరిమితులు ప్రతిభకు అడ్డురావొద్దని అడిషనల్కలెక్టర్(లోకల్బాడీస్) సంపత్రావు అన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో చదువుతూ శాస్త్రవేత్తలుగా ఎదగాలని సూచించారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో డీఈవో సిద్దార్థరెడ్డి పర్యవేక్షణలో బండారుపల్లి మోడల్పాఠశాలలో శుక్రవారం 53వ బాల వైజ్ఞానిక ప్రదర్శన, ఇన్స్పైర్మనాక్కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. జిల్లా విద్యార్థులు తమ ఎగ్జిబిట్లను జాతీయ స్థాయిలో ప్రదర్శించి ములుగుకు గుర్తింపు తీసుకురావాలని చెప్పారు.
సుస్థిర వ్యవసాయం, వ్యర్థాల నిర్వహణ, హరిత శక్తి, ఆధునిక సాంకేతికత, వినోదాత్మక గణితం, ఆరోగ్యం, జల సంరక్షణ వంటి అంశాలపై వివిధ పాఠశాలల విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జిల్లా సైన్స్ ఆఫీసర్జయదేవ్, డీసీఈబీ కార్యదర్శి సూర్యనారాయణ, ఏసీజీఈ వినోద్ కుమార్, ఎంఈవోలు దివాకర్, శ్రీనివాస్, మల్లయ్య, సమగ్ర శిక్ష కోఆర్డినేటర్లు రాజు, శ్యాంసుందర్ రెడ్డి, రజిత, శ్రీనివాస్ రెడ్డి, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ వార్డు గ్రహీత రామయ్య, హెచ్ఎంలు, టీచర్లు పాల్గొన్నారు.
