ఇదిగో వీడియో : 100 కిలోమీటర్ల బుల్లెట్ రైలు పట్టాలు రెడీ

ఇదిగో వీడియో : 100 కిలోమీటర్ల బుల్లెట్ రైలు పట్టాలు రెడీ

ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్ 100 కిలోమీటర్ల వయాడక్ట్‌లను పూర్తి చేయడంతో ఒక ప్రధాన మైలురాయిని సాధించింది. 40-మీటర్ల పొడవు గల ఫుల్‌స్పాన్ బాక్స్ గర్డర్‌లు, సెగ్మెంటల్ గిర్డర్‌లను ప్రారంభించిన తర్వాత ప్రాజెక్ట్ విజయాన్ని సాధించింది. మెట్రో వయాడక్ట్‌లలో ఉపయోగించే స్పాన్ పద్ధతుల ద్వారా నిర్మాణ ప్రక్రియను సంప్రదాయ స్పాన్ కంటే 10 రెట్లు వేగవంతం చేసింది.

ఈ క్రమంలోనే రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ నవంబర్ 23న కొనసాగుతున్న 'బుల్లెట్ రైలు' ప్రాజెక్ట్ పురోగతిని చూపించే ఓ వీడియోను పంచుకున్నారు. "బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ పురోగతి: 21.11.2023 వరకు... పిల్లర్లు: 251.40 కి.మీ. ఎలివేటెడ్ సూపర్ స్ట్రక్చర్: 103.24 కి.మీ" అని కేంద్ర మంత్రి ఎక్స్‌లో ఒక పోస్ట్‌లో తెలిపారు. పురోగతిలో భాగంగా మొదటి కిలోమీటర్‌ను ఆరు నెలల్లో పూర్తయింది, కేవలం 10 నెలల్లో 50 కిలోమీటర్లకు చేరుకుంది. మొత్తం 16 నెలల్లో 100 కిలోమీటర్ల మార్కును చేరుకుంది అని ఒక అధికారి తెలిపారు. వయాడక్ట్‌లలో గుజరాత్‌లోని ఆరు నదులపై వంతెనలు ఉన్నాయి: అవి పర్, పూర్ణ, మింధోలా, అంబికా, ఔరంగ, వెంగనియా. అదనంగా, 250 కిలోమీటర్ల పైర్ వర్క్‌ను పూర్తి చేయడం ప్రాజెక్ట్ సమగ్ర పురోగతిని నొక్కి చెబుతుందని ఆయన అన్నారు.

నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ ప్రకారం, ఈ ప్రాజెక్ట్ గుజరాత్‌లోని వల్సాద్ జిల్లాలో 350 మీటర్ల పర్వత సొరంగాన్ని పూర్తి చేయడం ద్వారా సొరంగంలో కూడా పురోగతి సాధించింది. సూరత్ జిల్లా 70 మీటర్ల పొడవుతో మొదటి ఉక్కు వంతెనను నిర్మించింది. కారిడార్‌లో అంతర్భాగంగా 27 ఉక్కు వంతెనలకు పునాది వేసింది.