
కెన్యా నుంచి బంగారాన్ని తరలిస్తూ ఓ మహిళ పట్టుబడింది. కెన్యా నుంచి రూ. 1.63 కోట్ల విలువైన బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తుండగా..మహిళను ముంబై ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఆమె నుంచి దాదాపు మూడున్నర కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే..
ALSO READ : Bihar Caste survey : బీహార్ లో ఓసీలు 16 శాతమే.. సర్వేలో సంచలన విషయాలు
సహ్రా మహ్మద్ ఒమర్ (40) అనే మహిళ నైరోబి దేశం నుంచి ముంబై ఎయిర్ పోర్టులో దిగింది. ఆమె కదలికలపై అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు..సహ్రా మహ్మద్ ఒమర్ను తనిఖీ చేశారు. అయితే తన ఇన్నర్ వేర్లో 3,404 గ్రాముల బంగారాన్ని దాచినట్లు గుర్తించారు. అనంతరం బంగారాన్ని సీజ్ చేసి ఆమెను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసిన కస్టమ్స్ అధికారులు ఒమర్ ను 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.