టాప్-2 ఎవరిదో .. ఇయ్యాల (మే 26న) ముంబై, పంజాబ్ మ్యాచ్ 

టాప్-2 ఎవరిదో .. ఇయ్యాల (మే 26న) ముంబై, పంజాబ్ మ్యాచ్ 

జైపూర్: ఐపీఎల్-18 ప్లే ఆఫ్స్క ముందు ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ కీలక పోరుకు సిద్ధమ య్యాయి. సోమవారం జరిగే ఆఖరి లీగ్ మ్యాచ్లో గెలిచి టాప్-2 ప్లేస్ ఎలిమినేటరు క్వాలిఫై అవ్వా లని ఇరుజట్లూ లక్ష్యంగా పెట్టుకున్నాయి. ప్రస్తు తం 17 పాయింట్లతోపంజాబ్ రెండో ప్లేస్లో ఉంది. కానీ ఈ మ్యాచ్లో ముంబై చేతిలో ఓడితే మూడు లేదా నాలుగో ప్లేస్కు పడిపోతుంది. దాంతో మే 30న జరిగే ఎలిమినేటర్ మ్యాచ్ ఆడాల్సి వస్తుంది. ఢిల్లీతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో నెగ్గితే ఈ పరిస్థి తి వచ్చి ఉండేది కాదు. కాబట్టి ముంబైతో మ్యాచ్లో ఎలాగైనా గెలవాలని ప్లాన్స్ వేస్తోంది. ఇక నాలుగు ప్లే ఆప్స్ జట్లలో మెరుగైన రక్తేట్ కలిగిన ముంబై ఈ మ్యాచ్లో గెలిస్తే మరింత లాభం చేకూరుతుం ది. ఒకవేళ తమ ఆఖరి మ్యాచ్లో ఆర్సీబీ ఓడిపోతే ముంబై 18 పాయింట్లతో డైరెక్ట్ టాప్ ప్లేస్కు వెళ్తుంది. 

ఈ సమీకరణాలను కాసేపు పక్కనబెడితే ముంబైతో మ్యాచ్ కోసం తమ బౌలింగ్ లోపాలను సరిదిద్దుకోవాలని పంజాబ్ ప్రయత్నిస్తోంది. గ్రౌండ్ చిన్నది కావడం, బ్యాటింగ్కు అనుకూలమైన పిచ్ ఉండటంతో ఇరుజట్ల బౌలర్లకు కఠిన పరీక్ష ఎదురు కానుంది. అయితే బౌలింగ్ పరంగా పంజాబ్ కంటే ముంబై మెరుగ్గా ఉంది. బుమ్రా ఫామ్లో ఉండటం, బౌల్ట్, దీపక్ చహర్ కూడా సమానంగా భారాన్ని పంచుకోవడం కలిసొచ్చే అంశం. ఇక గత మ్యాచ్ ఆడని అర్ష్దీప్, చహల్, యాన్సెన్ తిరిగి రావడం పంజాబ్కు శుభసూచకం.