25 మంది ఉద్యోగులను తీసేసిన రోజు గుర్తుకొస్తే ఏడుపొస్తుంది : ఓ కంపెనీ CEO ఎమోషనల్ వార్డ్స్

25 మంది ఉద్యోగులను తీసేసిన రోజు గుర్తుకొస్తే ఏడుపొస్తుంది : ఓ కంపెనీ CEO ఎమోషనల్ వార్డ్స్

టెక్ రంగంలో ఉద్యోగాల నియామకాల కంటే తొలగింపులే ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి. కరోన లాక్ డౌన్ తరువాత చిన్న, పెద్ద కంపెనీలు అనే తేడా లేకుండా  ఉద్యోగాల కోతతో విరుచుకుపడ్డాయి. ఎంతో మంది రోడ్డునపడ్డారు కూడా... అయితే ఒకప్పటి  కార్పొరేట్ కెరీర్‌లో చీకటి రోజులని గుర్తుచేసుకుంటూ ఓ CEO చేసిన పోస్ట్ ఇప్పుడు నెటిజన్ల నుండి ప్రశంసలు కురిపిస్తుంది.  ఆ రోజుల్లో ఈ సీఈఓ ఒకరి తర్వాత ఒకరు ఇలా చాల మందిని తొలగించాల్సి వచ్చింది. దింతో ఉద్యోగులను తీసేసేటప్పుడు   టీం లీడర్లు ఎదుర్కొనే బాధపై చర్చకు దారితీసింది.

ముంబైకి చెందిన CEO & వ్యవస్థాపకుడు సంపర్క్ సచ్‌దేవా లింక్డ్‌ఇన్‌లో కొన్ని ఏళ్ల  క్రితం 25 మందిని ఒకేసారి తొలగించమని కంపెనీ చెప్పినపుడు తనకు ఎలా అనిపించిందో పోస్ట్ చేశారు. అప్పుడు యాజమాన్యం తనను కూల్ గా ఉండమని, ఎటువంటి ఎమోషన్స్ చూపించొద్దని  చెప్పినట్లు అన్నారు.

చివరికి సచ్‌దేవా చెప్పినట్లుగానే చేశాడు, కానీ తీసేసిన  ప్రతి ఉద్యోగిని గుర్తుంచుకున్నాడు. అందులో ఇద్దరు పిల్లలు ఉన్న ఓ మహిళా "సర్, మీరు నన్ను నియమించుకున్నారు. మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టే నేను ఉండిపోయాను. ఈ రోజు మీరే  నన్ను తీసేస్తున్నారు అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారన్నారు. 

సోషల్ మీడియాలో కామెంట్లు: ఖచ్చితంగా టీం లీడర్షిప్ అంటే అంత ఈజీ కాదు. వారిని ఇంకా గుర్తించుకున్నందుకు మీరు గ్రేట్. టీం లీడర్షిప్ అనేది నిజంగా నిర్ణయాలకు సంబంధించినది. అలాగే సానుభూతి, అవగాహన గురించి కూడా అని అనగా... మరొకరు ఇది ఓ టీం లిడర్ తన టీం/ఉద్యోగులని ఎదుర్కోవాల్సిన అత్యంత కష్టమైన సమయం. తొలగిపోయిన వాళ్ళు చాల బాధపడొచ్చు  కానీ తొలగించిన వాళ్ళు లోపల బాధతో నలిగిపోతారు అయినా కూడా పైకి  మౌనంగా కూర్చోవలసి వస్తుంది అని కామెంట్ చేసారు.  ఇంకొకతను ఇది ఎంత భారంగా అనిపిస్తుందో నాకు తెలుసు. ఇలాంటి పరిస్థితులు అంత ఈజీ కాదు. వృత్తిపరమైన అనుభవాలే కాదు, ఇలాంటి జ్ఞాపకాలు కూడా  మీతో పాటు ఉంటాయి అని అన్నారు.