Gen Z యువతకు బిగ్ బాస్ లాంటి ఛాన్స్.. BMC ఫెలోషిప్‌తో ముంబైని డెవలప్ చేసే గోల్డెన్ ఛాన్స్...

 Gen Z యువతకు బిగ్ బాస్ లాంటి ఛాన్స్.. BMC ఫెలోషిప్‌తో ముంబైని డెవలప్ చేసే  గోల్డెన్ ఛాన్స్...

ముంబై నగర అభివృద్ధిలో భాగం కావాలనుకునే యువతకు బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) అదిరిపోయే శుభవార్త చెప్పింది. యువ గ్రాడ్యుయేట్ల కోసం 'BMC జెన్ జెడ్ ఫెలోషిప్ ప్రోగ్రామ్ 2026' ను ప్రకటించింది. 
 
BMC జెన్ జెడ్ ఫెలోషిప్ ప్రోగ్రామ్ 2026 హైలెట్స్ :
*ప్రతి నెలా రూ.61,500  స్టైపెండ్ ఇస్తారు.
*కేవలం 50 సీట్లు మాత్రమే  ఉన్నాయి.
*ఈ ప్రోగ్రామ్ మొత్తం 12 నెలలు అంటే ఏడాది మాత్రమే పాటు ఉంటుంది.
*దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాలి.
*ఫెలోషిప్‌ విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ లభిస్తుంది.


అర్హతలు ఏమిటి?
*ఏదైనా డిగ్రీ/గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
* అభ్యర్థుల వయస్సు 28 సంవత్సరాల లోపు ఉండాలి.
*మరాఠీ భాష మాట్లాడటం, చదవడం, రాయడం కచ్చితంగా వచ్చి ఉండాలి. వీటితో పాటు హిందీ, ఇంగ్లీష్ భాషలపై కూడా అవగాహన ఉండాలి.
*కంప్యూటర్ జ్ఞానం అంటే  కంప్యూటర్ ఇంకా ఇంటర్నెట్ వినియోగం తెలిసి ఉండాలి.

 ముఖ్యమైన తేదీలు
*దరఖాస్తులు ప్రారంభం: 19 ఆగస్టు  2026
*చివరి తేదీ: 31 ఆగస్టు 2026

ALSO READ : కాక్రోచ్ల నెక్స్ట్ టార్గెట్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్..

 ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక BMC రిక్రూట్‌మెంట్ పోర్టల్ https://bmc.recruitlive.in/#/login ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. గడువు ముగిసేలోగా వివరాలను చెక్ చేసుకొని అప్లై చేయండి. 

 BMC జెన్ జెడ్ ఫెలోషిప్ ప్రోగ్రామ్ యువ గ్రాడ్యుయేట్లకు ప్రభుత్వ పరిపాలనపై ప్రత్యక్ష అవగాహన, ఎలా సాగుతుంది అనే దానిపై  మంచి అనుభవంతో పాటు ముంబై అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలలో పాల్గొనేందుకు, లీడర్షిప్ లక్షణాలు నేర్చుకునే గొప్ప అవకాశం అందిస్తుంది.